sarvanga sundhara

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

sarvanga sundhara – సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా Yesanna Songs yesanna telugu christian songs hosanna ministries songs
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2
1.నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా “2”
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా “2” – “సర్వాంగ’
2.నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా “2”
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా “2” -“సర్వాంగ”
3.నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా “2”
నా అపజయమలన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయధ్వజమైతివా “2” – “సర్వాంగ”