నీ ప్రేమే ఉన్నతము – Ne preme unnatamu

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నీ ప్రేమే ఉన్నతము…
నీ కృపయే జీవము…
నా ప్రాణమునకు అదియే ఆధారము.(2)
నీవే నా ప్రాణము సర్వము.. నీవే నా ధైర్యము (2)
అరణ్యపు భూమిలో అలసియున్న నాకు
వర్షపు చినుకువై నన్ను తాకినావు….
వేదన ఊబిలో మునిగిపోతుండగా..
కరుణ హస్తాలతో పైకి లేపినావు…(2)
నీ ప్రేమను పొందుటకు అర్హుడ నేను కానే కాదయ్య
అయినా నీవు నీ కృప చూపి బలపరచితివయ్య..(2)
మనుషుల మాటలే మదినే రేపగా..
మంచి సమరయునిల చేరదీసినావు..
గాయములకు నీవు వైద్యము చేసి చెదరిన గుండెను బాగు చేసినావు.. (2)
నిను నేను స్తుతియించిన నీ ఋణమే తీరదయా
నా జీవితకాలమంతయు నిన్నే కొనియాడేదనయ్యా (2)
నీ ప్రేమే ఉన్నతము…
నీ కృపయే జీవము…
నా ప్రాణమునకు అదియే ఆధారము.(2)
నీవే నా ప్రాణము సర్వము… నీవే నా ధైర్యము (2)