పవళించినాడు యేసురాజు – Pavalincinadu yesuraju

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

పవళించినాడు యేసురాజు
పశులపాకలో శ్రీమంతుడైనవాడు
పాప విమోచన కొరకు
భువిలో ఉదయించెను
యేసురాజు క్రీస్తురాజు
మానవత్వము దైవతత్వము
కలబోసిన రూపమైన యేసుక్రీస్తునాధుడు
అమితముగా మనలను ప్రేమించిన ప్రేమ
తన సొత్తుగా చేయుటకు ఇలకే అరుదించెను
పవిత్రుడైన వాడు పరిశుద్ధుడైన వాడు
ఏ కళంకములేని వాడు దివినేలు రారాజు
జనముల పాపముకై సిలువలో మరణించెను
మృత్యుంజయుడైనాడు కారణజన్ముడు
జన్మించినాడు యేసురాజు
నీ హృదిలో నా హృదిలో ఈనాడు