ఒక తార పుట్టింది నింగిలో – Oka Tara Puttindi

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

ఒక తార పుట్టింది నింగిలో
ఈ నేల మురిసింది వెలుగులో
దివినేలే దేవ దేవుడు…
నరునిపైన కరుణ చూపెను
బెత్లెహేములో – పశుల పాకలో
రక్షకుడు జన్మించెను
సంబరాలు సంబరాలు – సంబరాలు
సంబరాలు సంబరాలు – సంబరాలు
ఒక దూత దిగివచ్చే రేయిలో
శుభవార్త ప్రకటించే మహిమలో
పరలోక సమూహమంతా
స్తుతీ గానము పాడిరి
బెత్లెహేములో – పశుల పాకలో
రక్షకుడు జన్మించెను
సంబరాలు సంబరాలు – సంబరాలు
సంబరాలు సంబరాలు – సంబరాలు
అటు తూర్పు దేశపు జ్ఞానులు
యెరూషలేమునకు చేరిరి
శిశువునకు సాగిలపడిరి
కానుకలు సమర్పించిరి
బెత్లెహేములో – పశుల పాకలో
రక్షకుడు జన్మించెను
సంబరాలు సంబరాలు – సంబరాలు
సంబరాలు సంబరాలు – సంబరాలు