బేత్లెహేము పురమందున – Bethlehemu Puramanduna Lyrics

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

పల్లవి: బెత్లెహేము పురమందున – రారాజు పుట్టాడంట
రారండి జనులారా – రక్షకుని చూసొద్ధాం…..
ఆడి పాడి ఆనందిద్దాం…….
బెత్లెహెము పురమందున – రారాజు పుట్టాడంట
రారండి జనులారా – ఆడి పాడి ఆనందిద్దాం : 2 సార్లు
కలిసి మెలిసి పోదాం – రక్షకుని చూసొద్ధాం : 2 సార్లు
అ.ప: ఆనందం పరమానందం – నింగీ నీలా పరవశం :2 సార్లు: (బెత్లె )
1 చ: గొల్లలకు శుభవార్త – అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు – రక్షకుండు పుట్టాడని :2 సార్లు
దివియందు దేవునికి మహిమ – భువియందు సమాధానం :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : (బెత్లె)
2 చ: పాపాల వలయంలో – మనుజులు పడివున్నప్పుడు
పాపాన్ని రూపుమాప – పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ :2 సార్లు
కన్య మరియ గర్భాన్న – మనుజావతారుడై పుట్టెన్ :2 సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం: ( బెత్లె)
3 చ: నింగిలో వింతైన తారా – జ్ఞానులకు దారి చూపింది
రారాజుని గాంచి – కానుకలు అర్పించి పూజించిరి : 2సార్లు
రారాజు జననం మానవాళికే వరం – విరోధికే కలవరం : 2సార్లు
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం : ఆనందం : ( బెత్లె).
Bethlehemu Puramanduna Lyrics in English